- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష రూపాయల బ్యాగును తిరిగిచ్చిన వృద్ధురాలు
దిశ, ఖమ్మం: ఎవరికైనా రోడ్డు మీద వందరూపాయల నోటు కనిపిస్తే.. ఎవరూ చూడకముందే తీసి జేబులో వేసుకుంటాం.. నేడు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కానీ ఓ వృద్దురాలు దానికి భిన్నంగా తన నిజాయితీని నిరూపించుకుంది. ఆర్థికంగా నిరుపేదే అయినా.. నిజాయితీలో ఉన్నతురాలు అనిపించుకుంది. భద్రాచలం జిల్లా కేంద్రంలోని మధువన్ హోటల్లో సోమవారం సంజీవ రెడ్డి రూ.లక్ష బ్యాగును మరిచిపోయారు. అందులో పెద్ద మొత్తంలో డబ్బులున్నట్టు గుర్తించిన హోటల్‌లో పనిచేస్తున్న సుభద్రమ్మ వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి యజమాని మధువన్ రెడ్డికి ఇచ్చింది. బ్యాగులో ఉన్న వివరాల ఆధారంగా సంజీవ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడకి చేరుకున్న సంజీవరెడ్డికి డబ్బు తిరిగి ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధురాలి నిజాయితీని అందరూ కొనియాడారు. ఈ విషయం తెలుసుకున్న జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు సుభద్రమ్మను సన్మానించారు.