- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్‌గా కొబ్బరిచిప్ప ధరించిన వ్యక్తి… పోలీసుల పనిష్మెంట్ ఇదే!
దిశ, ఫీచర్స్ : పాండమిక్ మొదలైనప్పటి నుంచి మాస్క్ వాడకం డైలీ లైఫ్‌స్టైల్‌లో భాగమైపోయింది. వైరస్ నివారణకు ఫస్ట్ ప్రికాషన్ మాస్క్ ధరించడమే కాగా.. డిఫరెంట్ స్టైల్స్, కలర్స్‌తో పాటు యూనిక్ డిజైన్స్‌తో కూడిన రకరకాల మాస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అంతేకాదు అందుబాటులో ఉన్న అనేక వస్తువులతో మాస్క్‌లు తయారుచేయడంలోనూ చాలామంది తమ క్రియేటివిటీ చూపించారు. ఈ క్రమంలోనే ఇండోనేషియాలోని బాలిలో ఓ పార్కింగ్ అటెండెంట్ కొబ్బరిచిప్ప మాస్క్‌తో వార్తల్లో నిలిచాడు.
‘నేంగా బుడియాసా’ అనే వ్యక్తికి తన పార్కింగ్ డ్యూటీలో భాగంగా నిత్యం విజిల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో నోటి భాగంలో కొబ్బరిచిప్పకు హోల్ చేసి విజిల్ ఊదేందుకు అనువుగా తయారుచేసుకున్నాడు. ఈ క్రమంలోనే సదరు మాస్క్ ధరించి పార్కింగ్ లాట్‌లో విజిల్ ఊదుతున్న అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి చేరడంతో.. కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి నిబంధనలు పాటించడం లేదని అతనికి శిక్ష విధించారు. అయితే ఫైన్ రూపంలో కాకుండా బుడియాసాతో పుష్-అప్స్ చేయించి మందలించి వదిలేశారు. నిజానికి అతను ఎటువంటి రూల్స్ అతిక్రమించనప్పటికీ మాస్క్‌ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపయోగించడం లేనందున నామమాత్రపు శిక్ష వేసి, సరైన మాస్క్‌లు అందించామని సంబంధిత అధికారి తెలిపారు.
కాగా, ఈ సంఘటనపై స్పందించిన బుడియాసా.. ‘డ్యూటీలో భాగంగా విజిల్ వేయాల్సి వచ్చినప్పుడల్లా మాస్క్ తీయడం ఇబ్బందిగా ఉంది. ప్రతీసారి తీయడం వల్ల మాస్క్ మురికిగా మారిపోతోంది. దీనిపై చాలామంది కస్టమర్లు కూడా కంప్లయింట్ చేశారు. ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకే కొబ్బరిచిప్ప మాస్క్ ధరించాను’ అని తెలిపాడు.