- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లారీకి అడ్డంగా వృద్ధ మహిళ.. అసలేం జరిగింది ?
దిశ, నేలకొండపల్లి: మట్టి దందాను కొనసాగిస్తున్న లారీని వృద్ధ మహిళ అడ్డుకుంది. కొన్ని నెలలుగా మండల కేంద్రానికి రహదారి నిర్మాణం కోసం శివారు గ్రామాలలోని మట్టిని కొందరు అక్రమార్కులు ఎలాంటి పర్మిషన్ లేకుండా రాజకీయ నాయకుల పలుకుబడి అండదండలతో మట్టి దందాను కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలోని రోడ్లన్ని గుంతల మయమై, దుమ్ము, ధూళితో రోడ్డు పక్కన ఉన్న ఇండ్లన్ని నిండి పోతుయి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా కమీషన్ల మత్తులో పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
ఇదంతా గమనించిన ఓ వృద్ధ మహిళ గురువారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డగించి, నిలువరించడంతో ఆ ప్రాంతంలో గంటసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ విధి మొత్తం లారీలు తిరిగి గుంతలు ఏర్పడి తాము ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. లారీకి అడ్డుగా పడుకొని వినూత్నంగా తన నిరసనను తెలిపింది. విశ్వాసనీయులు కొందరు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విషయాన్ని గ్రహించిన మట్టి దందా కాంట్రాక్టర్లు లారీలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే అధికారుల రాకను గమనించే.. వారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపునే, లారీలు ఎక్కడికక్కడే పరారయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు సమయస్ఫూర్తితో అక్రమ మట్టి దందాను నిలువరించి, దుమ్ము, శబ్ద కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మట్టి దందాను ధైర్యంగా ఎదుర్కొన్న వృద్ధ మహిళ రాజ్యంను పలువురు అభినందిస్తున్నారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడి భార్య కావడం కొసమెరుపు.