ఆయమ్మకు అండగా.. ఓ యువకుడి పోస్ట్‌

by Shyam |   ( Updated:2021-01-08 22:34:10.0  )
ఆయమ్మకు అండగా.. ఓ యువకుడి పోస్ట్‌
X

దిశ, కూకట్‌పల్లి: పక్కవాళ్ల గురించి ఆలోచించని ఈ రోజుల్లో.. ఓ యువకుడి పోస్ట్‌కు చాలా మంది స్పందించారు. ఓ వృద్ధురాలికి అపన్నహస్తం అందించి ఆమెకు తిరిగి ఉపాధిని కల్పించారు. వివరాళ్లోకి వెళితే… కూకట్‌పల్లిలోని ఫోరం మాల్ సమీపంలో 70 ఏండ్ల ఆయమ్మ కొంత కాలంగా టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజు మాదిరిగానే ఆయమ్మ వద్దకు టీ తాగడానికి వచ్చిన నాగసాయి అనే వ్యక్తి.. ఆమె దిగాలుగా ఉండటాన్ని గమనించి ఆమెతో మాటలు కలిపి విషయం తెలుసుకున్నాడు. తన టీ స్టాల్లో దొంగలు పడి సిలిండర్, స్టౌవ్‌తో పాటు వస్తువులను ఎత్తుకుపోయారని ఆయమ్మ వాపోయింది.

దీంతో నాగసాయి తన ఇన్‌స్టా‌గ్రాం అకౌంట్లో సాయం కోసం పోస్ట్ పెట్టి దాన్ని ‘రైస్ బకెట్ చాలెంజ్ ఫౌండర్’ మంజులత కళానిధికి ట్యాగ్ చేశాడు. స్పందించిన మంజులత తన ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆయమ్మతో మాట్లాడి విషయం తెలుసుకుంది. మంజులత పోస్ట్‌కు స్పందించిన ‘ధృతి వెల్‌నెస్ క్లీనిక్‌’ నిర్వాహకులు సైక్రియాటిస్ట్ డాక్టర్ పూర్ణిమా నాగరాజ ఆయమ్మ కుమారుడికి రూ.7వేలను గూగుల్ పే చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి పంతంగి విద్యాసాగర్ టీ స్టాల్‌కు కావలసిన స్టవ్ అందించారు. కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ జయరామ్ వంటపాత్రలను అందజేశారు. దీంతో ఆయమ్మకు తిరిగి తన టీ స్టాల్‌ను ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed