అరుదైన ఘనత సాధించిన హైదరాబాద్ చిన్నోడు

by Shyam |   ( Updated:2021-05-14 09:31:56.0  )
Sourav Devulapalli
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎనిమిదేళ్ల హైదరాబాద్ బాలుడు అరుదైన ఘనత సాధించాడు. దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ అబాకస్ కాంపిటీషన్ ‘‘నేషనల్ ప్రాడిజీ 2021” లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 17 మంది జాతీయ ఛాంపియన్‌లలో ఒకరిగా నిలిచి తెలంగాణ ఖ్యాతిని దేశానికి చాటాడు. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో సౌరవ్ దేవులపల్లి 4వ తరగతి చదువుతున్నాడు. సీప్ అకాడమీ వారు నిర్వహించిన ఆన్‌లైన్ అబాకస్ కాంపిటీషన్ – నేషనల్ ప్రాడిజీ 2021” లో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాలు, 183 పట్టణాల నుండి 27 వేల మంది 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పాల్గొనగా సౌరవ్ వారితో పోటీపడి దేశంలో టాపర్‌గా నిలిచాడు. పదిహేడు మంది ఛాంపియన్లలో ఒకరిగా నిలిచాడు. ఈ పోటీలో 200 వందల లెక్కలను కేవలం 11 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా సరైన సమాధానాలు ఇచ్చిన పదిహేడు చిన్నారులను జాతీయ ఛాంపియన్లుగా ప్రకటించారు. క్యాలికులేటర్ కన్నావేగంగా లెక్కలు చేయవలసి ఉంటుంది.

అమ్మ, నాన్నలు ప్రోత్సాహంతోనే : సౌరవ్

‘‘నేను ఈ పోటీలో ఉత్తమ ప్రదర్శన కనబరిస్తే కరోనాను మన ఊరి నుండి వెళ్లగొట్టవచ్చునని మా అమ్మా, నాన్నలు చెప్పారు. అలా చేస్తే, కరోనా అడవికి వెళ్లిపోతుందని, నేను సంతోషంగా తిరిగి పాఠశాలకు వెళ్లి నా స్నేహితులతో ఆడుకోగలనని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అందుకోసం టీవీ కూడా చూడకుండా చాలా ప్రాక్టీస్ చేశాను’’ అని చిన్నారి సౌరవ్ దేవులపల్లి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed