కరోనా గురించి మొదట హెచ్చరించిన డాక్టర్ మృతి

        కరోనా వైరస్ ఉపద్రవం గురించి మొదట హెచ్చరించిన ఎనిమిది మంది డాక్టర్లలో ఒకరైన లీ వెన్లీయాంగ్ అదే వైరస్ సోకి మరణించారు. గతేడాది డిసెంబర్‌లో వుహాన్‌లో కరోనా వైరస్ ప్రబలుతోందని ప్రచారం చేయడంతో 34 ఏళ్ల లీ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు.         చైనా మెసేజింగ్ యాప్ వియ్‌చాట్‌లో సార్స్ లాంటి వైరస్ బారినపడి ఏడుగురు అస్వస్థత గురయ్యారని లీ మెసేజ్ పెట్టాడు. దీని గురించి […]

Update: 2020-02-06 20:41 GMT

రోనా వైరస్ ఉపద్రవం గురించి మొదట హెచ్చరించిన ఎనిమిది మంది డాక్టర్లలో ఒకరైన లీ వెన్లీయాంగ్ అదే వైరస్ సోకి మరణించారు. గతేడాది డిసెంబర్‌లో వుహాన్‌లో కరోనా వైరస్ ప్రబలుతోందని ప్రచారం చేయడంతో 34 ఏళ్ల లీ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు.

చైనా మెసేజింగ్ యాప్ వియ్‌చాట్‌లో సార్స్ లాంటి వైరస్ బారినపడి ఏడుగురు అస్వస్థత గురయ్యారని లీ మెసేజ్ పెట్టాడు. దీని గురించి సన్నిహితులను వ్యక్తిగతంగా హెచ్చరించమని లీ, అతని స్నేహితులకు మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. దీంతో పుకార్లు పుట్టిస్తున్నాడని లీ ని వుహాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ లీ చెప్పిన విషయమే చివరికి నిజమైంది. ఇప్పటికి ఈ వైరస్ బారిన పడి 564 మంది మృత్యువాత పడగా, 28,018 మందికి ఈ వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News