German Christmas Market: జర్మనీ క్రిస్మస్ మార్కెట్ ఘటనను ఖండించిన భారత్
జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిపై భారత్ స్పందించింది. జర్మనీలో జరిగిన దాడిలో ఐగుగురు చనిపోగా.. 41 మంది గాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిపై భారత్ స్పందించింది. జర్మనీలో జరిగిన దాడిలో ఐగుగురు చనిపోగా.. 41 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు. జర్మనీలోని మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన దాడిని భారత్ ఖండిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “ ఈ దాడిలో చాలా విలువైన ప్రాణాలు పోయాయి. చాలా మంది గాయపడ్డారు. బాధితులకు అండగా ఉంటాం’’ అని తెలిపింది. జర్మనీలోని ఇండియన్ ఎంబసీ గాయపడిన భారతీయులతో, అలాగే వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోందంది పేర్కొంది. సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొంది. అలాగే, ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు గాయపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారిలో ముగ్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో నలుగురు చికిత్స పొందుతున్నారంది.
కారు బీభత్సం
కాగా, క్రిస్మస్ పండుగ సమయంలో జర్మనీలో విషాద ఘటన జరిగింది. మాగ్డెబర్గ్ నగరంలోని రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్‌లో 400 మీటర్ల దూరం వరకు వేగంగా కారు దూసుకెళ్లినట్లు వెళ్లినట్లు సీసీఫుటేజీలో కనిపిస్తుంది. ఈ దారుణానికి పాల్పడిన తాలెబ్.ఎ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన వ్యక్తిగా డాక్టర్ తలేబ్‌ను(50)ను గుర్తించారు. ఇక, గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వార్తలొస్తున్నాయి.