జడ్పీ చైర్ పర్సన్ వర్సెస్ ఎంపీపీ.. రెండు వర్గాలుగా టీఆర్ఎస్
దిశ, జమ్మికుంట: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జడ్పీ చైర్ పర్సన్‌కు ఎంపీపీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇతర ప్రాంతాలకు నుంచి తన మండలానికి వచ్చి కార్యక్రమాలు చేయడంతోపాటు ప్రొటో కాల్ పాటించలేదని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సుడా చైర్మన్ […]
దిశ, జమ్మికుంట: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో జడ్పీ చైర్ పర్సన్‌కు ఎంపీపీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇతర ప్రాంతాలకు నుంచి తన మండలానికి వచ్చి కార్యక్రమాలు చేయడంతోపాటు ప్రొటో కాల్ పాటించలేదని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావుతోపాటు జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ హాజరయ్యారు.
కాగా, ఇదే కార్యక్రమానికి హాజరైన ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జడ్పీ చైర్ పర్సన్ విజయ కల్పించుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని శాంతింపజేశారు.
కాగా, ఎంపీపీ పావని ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. నేపథ్యంలోనే వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం ఎంపీపీ పావని మాట్లాడుతూ… స్థానిక ప్రజాప్రతినిధులతో కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి ద్వారా చెక్కులు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.