కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్‌కు కరోనా పాజిటివ్
దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ కరోనా బారిన పడ్డారు. బుధవారం అనారోగ్యానికి గురైన విజయ కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. ఆదర్శంగా… జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేస్తున్న విజయ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ కావడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు కరోనా బారిన పడితే వారిని గాంధీలో చేర్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్న […]
దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ కరోనా బారిన పడ్డారు. బుధవారం అనారోగ్యానికి గురైన విజయ కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు.
ఆదర్శంగా…
జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా పనిచేస్తున్న విజయ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ కావడం గమనార్హం. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లు కరోనా బారిన పడితే వారిని గాంధీలో చేర్పించాలన్న డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్ మాత్రం సివిల్ ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స చేయించుకుంటుండటం అందరినీ ఆలోచింపజేస్తుంది.