దొంగల బీభత్సం.. ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..
ఊరికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి
దిశ,మేడిపల్లి : ఊరెళ్ళి ఇంటికి వచ్చే సరికి ఇల్లు గుల్ల అవుతున్నాయి. రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో తాళం వేసున్న నాలుగు ఇండ్లతో పాటు ఒక దేవాలయంలో చొరబడ్డారు. మూడిళ్లలో నగలు, డబ్బులు లభించలేదు. అదే గ్రామానికి చెందిన గడ్డమీద రాకేష్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి సోమవారం రోజున తన అత్తగారి ఊరైన సంఘం వెళ్ళాడు. వెళ్లి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండగా ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన మూడునరా తులాల బంగారం, 3 తులాల వెండి, రూ.35 వేల నగదు, స్థానిక దుర్గమ్మ దేవాలయంలోని హుండినీ పగలగొట్టి నగదు తీసుకుని వెళ్లారు. వేరే వాళ్ళ ఇంట్లో నుంచి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి వెతికారు కానీ ఇలాంటి వస్తువులు కానీ బంగారు గాని దొరకలేదు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ఫింగర్ ప్రింట్ తీసుకొని వెళ్లారు.