ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి
వ్యవసాయ మోటారును వాగు నీటిలో దింపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది.
దిశ, లోకేశ్వరం : వ్యవసాయ మోటారును వాగు నీటిలో దింపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన పడల నర్సయ్య (42) వడ్తాల శివారులో గల వాగులో వ్యవసాయ మోటారును దింపడానికి వెళ్లగా నీటి లోతు గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం.