‘రైతును రాజు చేయాలనే రైతు వేదికలు’

దిశ, ఇల్లందు: టేకులపల్లి మండలం‌లోని ప్రగల పాడు, ముత్యాలంపాడు, పంచాయతీలో నిర్మించిన రైతు వేదికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలనే దృఢసంకల్పంతో గ్రామపంచాయతీల్లో రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ, తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఆర్థిక ఎదుగుదలకు […]

Update: 2021-08-30 05:03 GMT

దిశ, ఇల్లందు: టేకులపల్లి మండలం‌లోని ప్రగల పాడు, ముత్యాలంపాడు, పంచాయతీలో నిర్మించిన రైతు వేదికలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలనే దృఢసంకల్పంతో గ్రామపంచాయతీల్లో రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ, తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో రైతు వేదికలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమాదేవి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, గ్రంధాలయ చైర్మన్ రాజేందర్, రైతు సమితి రాష్ట్ర నాయకులు మాధవరావు, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News