Zomato బంపర్ ఆఫర్.. ఆ పని చేస్తే 3 లక్షలు ఇస్తారట..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఫుడ్ విషయాల్లో ఆఫర్లు ఇచ్చిన ఆ సంస్థ తాజాగా టెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జొమాటో యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్ పెడితే రూ.3 లక్షల వరకు రివార్డు ప్రకటిస్తామని తెలిపింది. జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ పేరుతో ఆ సంస్థ సెక్యూరిటీ లోపాలను సరిచేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇదిలాఉండగా, జొమాటో జులైలోనే పబ్లిక్ ఇష్యూ(ఐపీవో)కు రాబోతోంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఫుడ్ విషయాల్లో ఆఫర్లు ఇచ్చిన ఆ సంస్థ తాజాగా టెక్నాలజీ రిసెర్చర్లు, ఎథికల్ హ్యాకర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. జొమాటో యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్ పెడితే రూ.3 లక్షల వరకు రివార్డు ప్రకటిస్తామని తెలిపింది. జొమాటో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ పేరుతో ఆ సంస్థ సెక్యూరిటీ లోపాలను సరిచేసుకునే పనిలో నిమగ్నమైంది.
ఇదిలాఉండగా, జొమాటో జులైలోనే పబ్లిక్ ఇష్యూ(ఐపీవో)కు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తమ యాప్‌లో సెక్యూరిటీ లోపాలకు చెక్ పెట్టాలని భావించింది. అందుకే వెబ్‌సైట్‌లో కానీ, యాప్‌లో కానీ బగ్స్ కనిపెట్టాలని హ్యాకర్లను కోరింది. ఎవరైనా వాటిని గుర్తిస్తే 4 వేల డాలర్లు ఇస్తామని సెక్యూరిటీ ఇంజినీర్ యష్ సోధా ట్వీట్ చేశారు. బగ్స్ తీవ్రతను బట్టి గిఫ్ట్ విలువ ఉంటుందన్నారు. రిసెర్చర్లు పంపించే బగ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
ఇదే విధంగా గతంలో గుగూల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు తమ సర్వర్లలో బగ్ గుర్తించిన వారికి భారీగా రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జొమాటో కూడా ఇదే ప్రిన్సిపుల్‌ను పాటిస్తున్నట్లు సమాచారం. బగ్స్ వలన ఆయా సంస్థల కార్యాకలాపాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో భారీ ఎత్తున ఆ కంపెనీలు నష్టాన్ని చవిచూడాల్సి రావొచ్చు. దీంట్లో భాగంగానే జొమాటో కూడా హ్యాకర్లకు ఈ పని అప్పగించింది. పూర్తి వివరాల కోసం జొమాటో అఫిషీయల్ వెబ్‌సైట్ చూడాలని యష్ సోధా వివరించారు.