‘యూవీ’ ఆరు సిక్సర్లు కొట్టిన తర్వాత ఏం జరిగింది?
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ అల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా సిక్సులు కొట్టి విశ్వరూపం చూపించాడు. యువరాజ్ సింగ్ తాజాగా ఆనాడు జరిగిన ఘటన గురించి గుర్తు చేసుకున్నాడు. సిక్సులు కొట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ‘ఈ మ్యాచ్ అనంతరం సెమీస్‌లో ఆస్ట్రేలియాతో […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ అల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా సిక్సులు కొట్టి విశ్వరూపం చూపించాడు. యువరాజ్ సింగ్ తాజాగా ఆనాడు జరిగిన ఘటన గురించి గుర్తు చేసుకున్నాడు. సిక్సులు కొట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్ అనంతరం సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడ్డాము. దానికి స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ రిఫరీగా వ్యవహరించాడు. ఆయన తన దగ్గరకు వచ్చి నా కుమారుడి కెరీర్‌ను దాదాపు ముగించేసినందుకు చాలా థ్యాంక్స్ అని బాధపడ్డాడు. నాకు కూడా ఆ బాధ ఏమిటో నాకు తెలుసు. ఒకసారి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ దిమిత్ర మస్కరెన్హాస్ నా బౌలింగ్‌లో ఐదు సిక్సులు కొట్టాడు’ అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ రోజు ఆరు సిక్సులు కొట్టినప్పుడు ధరించిన జెర్సీని తన కుమారుడికి ఇవ్వమని క్రిస్ బ్రాడ్ కోరాడు. నేను నా జెర్సీపై ఇంగ్లాండ్ క్రికెట్ భవిష్యత్ నువ్వే.. గొప్ప ఘనతలు సాధిస్తావు అని రాసి ఇచ్చానని యువరాజ్ అన్నాడు. స్టువర్డ్ బ్రాడ్ ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో 500 పైగా వికెట్లు తీసి గొప్ప బౌలర్‌గా ఎదిగాడు.