BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్.. భారీగా క్యాష్ రివార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత జట్టు (India) విశ్వ విజేతగా నిలిచింది.

Update: 2025-03-20 06:45 GMT
BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్.. భారీగా క్యాష్ రివార్డ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)లో భారత జట్టు (India) విశ్వ విజేతగా నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయ దుధుంభి మోగించి టీమిండియా వరుసగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరింది. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌‌లో బెర్త్ ఖారారు చేసేకుంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన ఫైనల్‌లో టీమిండియా (Team India) 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 83 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు.

అదేవిధంగా శ్రేయాస్ అయ్యార్ (Shreyas Iyer) 62 బంతుల్లో 48 పరుగులు, కేఎల్ రాహుల్ (KL Rahul) 33 బంతుల్లో 34 పరుగులు, శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) 50 బంతుల్లో 31 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో ముచ్చటగా మూడోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ ప్రశంస జల్లు కురపించింది. జట్టులోని ఆటగాళ్లలో మరింత జోష్ నింపేందుకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఛాపింయన్స్ ట్నోఫీలో భాగస్వాములై ప్లేయర్లు అందరికీ కలిపి బీసీసీఐ మొత్తం రూ.58 కోట్లు నగదు బహుమతిని ప్రకటించింది. కాగా, ఛాపింయన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన భారత్‌కు ఐసీసీ రూ.19.50 కోట్ల ప్రైజ్‌మనీ అందజేసింది. రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.9.70 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.  

Tags:    

Similar News