పోస్కో లేదు.. ఉస్కోలేదు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

దిశ,వెబ్‌డెస్క్:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ వైసీపీ విశాఖలో భారీ బహిరంగం సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ స్టీల్ ఫ్యాక్టరీని వదులుకోవడానికి సిద్ధంగా లేమని సీఎం జగన్ స్పష్టం చేశారని అన్నారు. విశాఖకు రావొద్దని పోస్కో కంపెనీ ప్రతినిధులకు జగన్ చెప్పారు.కావాలంటే కడపలోనో కృష్ణపట్నంలోనో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని సూచించారు. […]

Update: 2021-02-20 08:45 GMT

దిశ,వెబ్‌డెస్క్:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించడాన్ని నిరసిస్తూ వైసీపీ విశాఖలో భారీ బహిరంగం సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పాదయాత్ర చేపట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ స్టీల్ ఫ్యాక్టరీని వదులుకోవడానికి సిద్ధంగా లేమని సీఎం జగన్ స్పష్టం చేశారని అన్నారు. విశాఖకు రావొద్దని పోస్కో కంపెనీ ప్రతినిధులకు జగన్ చెప్పారు.కావాలంటే కడపలోనో కృష్ణపట్నంలోనో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని సూచించారు.

‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడమే. స్టీల్‌ప్లాంట్‌కున్న రుణభారం రూ.25వేల కోట్లు. రుణభారాన్ని ఈక్విటీలోకి మారిస్తే స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లోకి వస్తుంది. ఇదే విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారని’ విజయసాయిరెడ్డి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోడీకి చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. కార్మిక సంఘాలకు పూర్తి భరోసాగా ఉంటాం .. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం పోరాడుతాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని విజయసాయిరెడ్డి పాదయాత్రలో మాట్లాడారు.

Tags:    

Similar News