LSG vs DC : ఢిల్లీ vs లక్నో ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన ఢిల్లీ
ఐపీఎల్ (IPL- 2025) 18వ సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) మధ్య మ్యాచ్ విశాఖపట్నం(Vishakhapatnam)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం(YSR Cricket Stadium)లో జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ (IPL- 2025) 18వ సీజన్లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్ - లక్నో సూపర్ జెయింట్స్(DC vs LSG) మధ్య మ్యాచ్ విశాఖపట్నం(Vishakhapatnam)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం(YSR Cricket Stadium)లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఆక్సర్ పటేల్(Aksor Patel) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ రెండు జట్లకు ఆరంభ మ్యాచ్ కాబట్టి ఇరుజట్లకు ఇది కీలక మ్యాచ్. లక్నో సూపర్ జెయింట్స్‌ను రిషభ్ పంత్(Rishab Panth) నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆక్సర్ పటేల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో, లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన ఐదు మ్యాచ్‌లలో లక్నో మూడుసార్లు గెలవగా.. ఢిల్లీ రెండుసార్లు విజయం సాధించింది.