అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఐసీసీ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంకాబోతోంది.

Update: 2025-03-27 12:25 GMT
అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఐసీసీ గ్రీన్‌సిగ్నల్
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంకాబోతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) రూ.800 కోట్లతో స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేసినట్టు జనవరిలో వెల్లడించింది. స్టేడియం నిర్మాణ దిశగా కీలక అడుగు పడింది. తాజాగా స్టేడియం నిర్మాణానికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోనేకాకుండా వరల్డ్‌లోనే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం అతిపెద్దది. 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ ఉంది.

నరేంద్ర మోడీ స్టేడియాన్ని మించి అమరావతిలో అతిపెద్ద స్టేడియం కట్టబోతున్నారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సంకల్పించింది. అందులో 60 ఎకరాల్లో స్టేడియాన్ని నిర్మించనున్నారు. స్టేడియంలో అధునాతన మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. మూడు ఫార్మాట్లకు ఆతిథ్యమిచ్చేలా పిచ్‌లు, అధునాతన ఫ్లడ్‌లైట్లుతోపాటు ఎకో ఫ్రెండ్లీ ఉండేలా పలు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. 2029లో జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించేలా చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష సమావేశమయ్యారు. 2029 జాతీయ క్రీడల నాటికి క్రికెట్ స్టేడియాన్ని అందుబాటులో తీసుకరావాలని ఏసీఏ భావిస్తున్నది.


Tags:    

Similar News