CSK Fan Girls: ట్రెండింగ్‌లో న్యూ మీమ్.. CSK ఫ్యాన్ గర్ల్స్ రియాక్షన్‌కి నెటిజన్లు ఫిదా
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రకరకాల మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రకరకాల మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. సాధారణ యూజర్లు, మీమర్లు వాటిని క్రియేట్ చేస్తుంటారు. వాటిలో సందర్భాన్ని భట్టి ఫన్నీ, ట్రోల్స్, రాజకీయ నేతలు, క్రికెటర్లు, ఇతరుల ఫోటోలు నెట్టింట షేర్‌లు చేస్తుంటారు. కొన్ని మీమ్స్ సరదాగా ఉంటే మరికొన్ని ఆసక్తిగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొత్త మీమ్ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చైన్నై సూప్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్యాన్ గర్ల్స్ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నప్పుడు వారి ఎక్స్‌ప్రెషన్ వీడియో సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిన్న (ఆదివారం) రాజస్థాన్ (Rajasthan Royals) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఇక ఐపీఎల్-2025 సీజన్‌లో చైన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా ఇది రెండో ఓటమి. అయితే, సీఎస్‌కే ప్లేయర్ ధోని చివరి ఓవర్ కోసం స్ట్రైక్‌లో ఉన్నప్పటికీ (20 పరుగులు అవసరం). ఆ సమయంలో సందీప్ శర్మ వేసిన లో ఫుల్ టాస్‌ను ధోని డీప్ లాంగ్ ఆన్ లో షిమ్రోన్ హెట్‌మెయర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న సీఎస్‌కే ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు లోనవుతారు.
కెమెరామెన్ అభిమానుల ముఖకవలికలు క్యాప్చర్ చేస్తున్న క్రమంలో ఆసక్తికర సన్నివేశం కెమెరాకు చిక్కుతుంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ధోని మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేసిన ఫ్యాన్ గర్ల్స్ ఒక్కసారిగా ధోని అవుట్ అవ్వడంతో అయ్యో! ఏంట్రా ఇది? అన్నట్లుగా ఫేస్ రియాక్షన్ ఇస్తారు. ఓ అందులో ఓ అమ్మాయి తన చేయి ముందుకు చాచి ఒక రకమైన ఫ్రస్టేషన్ చూపిస్తుంది. అమ్మాయిల ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫేస్ రియాక్షన్‌ను మార్కెట్లోకి కొత్త మీమ్ వచ్చిందంటూ నెటిజన్లు తెగ షేర్ చేస్తూ తాజాగా ట్రెండింగ్‌లోకి తెచ్చారు.