వేలంలో అశ్వని కుమార్‌కు రూ.30 లక్షలు వస్తే ఏం చేశాడో తెలుసా?

ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.

Update: 2025-04-01 14:27 GMT
వేలంలో అశ్వని కుమార్‌కు రూ.30 లక్షలు వస్తే ఏం చేశాడో తెలుసా?
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతాపై 4 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్వని రికార్డు నెలకొల్పాడు. అశ్వని సంచలన ప్రదర్శన పట్ల తండ్రి నాన్న హర్కేశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే, క్రికెట్‌పై తన కొడుకు ఉన్న ఇష్టాన్ని వివరించాడు.

‘వర్షం రానీ, ఎండకొట్టని అశ్వని మాత్రం శిక్షణకు వెళ్లడానికి ఎప్పుడూ వెనకాడలేదు. ట్రైనింగ్ నుంచి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చేవాడు. మళ్లీ ఉదయం 5 గంటలకే వెళ్లేవాడు. కొన్నిసార్లు పీసీఏ అకాడమీకి సైకిల్‌పై వెళ్లేవాడు. లిఫ్ట్ తీసుకునేవాడు. కొన్ని సందర్భాల్లో షేర్ ఆటోకు వెళ్లేవాడు. ఆటో చార్జీలకు నన్ను రూ.30 అడిగేవాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు తీసుకుంది. తాను తీసుకున్న ప్రతి పైసాకు న్యాయం చేశాడు.’ అని హర్కేశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా, మిచెల్‌స్టార్క్‌లా ఎదగాలని అశ్వని కలలు కనేవాడని అతని సోదరుడు శివ్ రాణా తెలిపాడు. ‘అశ్వని స్నేహితులు క్రికెట్ బంతుల కోసం డబ్బులు పోగు చేసేవారు. వేలం తర్వాత అశ్వని మా ఊరు పక్కన ఉన్న అకాడమీల్లో క్రికెట్ కిట్లు, బంతులు పంపిణీ చేశాడు. తన పేరున్న జెర్సీని ధరించడానికి అతను ఎప్పుడు కలలు కనేవాడు. ఇప్పుడు తన ప్రదర్శనతో పిల్లలు అతని జెర్సీ వేసుకునేలా చేసుకున్నాడు.’ అని శివ్ రాణా తెలిపాడు.


Tags:    

Similar News