IPL: మరోసారి దంచికొట్టిన SRH.. లక్నో టార్గెట్ ఎంతంటే?
సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు మరోసారి అదరగొట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) బ్యాటర్లు మరోసారి అదరగొట్టారు. వరుసగా వికెట్లు పడుతున్నా వచ్చిన వాళ్లు వచ్చినట్లు దంచికొట్టి వెళ్లారు. అభిషేక్ శర్మ(06), ఇషాన్ కిషన్(0) మినహా మిగిలిన ప్లేయర్లంతా రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్(SRH) బ్యాటర్లలో.. హెడ్(47), నితీష్ కుమార్ రెడ్డి(32), హెన్రిచ్ క్లాసెన్(26), అనికేత్ వర్మ(36) రాణించారు. మొత్తంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేశారు. లక్నో(Lucknow Super Giants) విజయలక్ష్యం 191 పరుగులు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, ఆవేశ్ ఖాన్, రాతి, రవి బిష్ణోయ్, యాదవ్ తలో వికెట్ తీశారు.