కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ముగింపు అప్పుడే!

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె దీక్ష మూడోరోజుకు చేరింది. దీక్ష ప్రారంభ రోజు ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిల అభిమానులకు మధ్య తోపులాట జరుగడంతో షర్మిల సొమ్మసిల్లిపడిపోయింది. దీంతో తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే దీక్ష చేస్తానన్నారు. తనను పోలీసులు గాయపరిచారని, మరోసారి చేయిపడితే […]

Update: 2021-04-16 21:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వైఎస్ షర్మిల దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె దీక్ష మూడోరోజుకు చేరింది. దీక్ష ప్రారంభ రోజు ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిల అభిమానులకు మధ్య తోపులాట జరుగడంతో షర్మిల సొమ్మసిల్లిపడిపోయింది. దీంతో తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే దీక్ష చేస్తానన్నారు.

తనను పోలీసులు గాయపరిచారని, మరోసారి చేయిపడితే ఊరుకోబోనని షర్మిల వార్నింగ్ ఇచ్చారు. చిరిగిన బట్టలుతోనేఆ తర్వాత షర్మిల లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. కాగా షర్మిల దీక్షకు ఆమె తల్లి విజయమ్మ సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం షర్మిల నిలబడిందని, శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. దీక్షలో ఉన్న షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. కాగా.. మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతానని షర్మిల చెప్పగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతిచ్చిన విషయం విదితమే. ఆదివారం మధ్యాహ్నం ఆమె దీక్ష విరమించనున్నారు.

Tags:    

Similar News