యూట్యూబ్‌లో కొత్తగా ‘న్యూ టు యూ’ ఫీచర్
దిశ, ఫీచర్స్ : ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యూట్యూబ్ కొత్తగా ‘న్యూ టు యూ’ ఫీచర్ విడుదల చేసింది. కానీ ఇది ప్రస్తుతం యూఎస్, యూకే, ఫ్రాన్స్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే వరల్డ్ వైడ్ కస్టమర్స్ దీని సేవలు పొందే అవకాశముందని 9to5google అనే టెక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ ఫీచర్ వినియోగదారుల వాచింగ్ ప్రిఫరెన్స్ ఆధారంగా కాకుండా కొత్త కంటెంట్‌ను అందింస్తుందని వెల్లడించింది. యూట్యూబ్ వినియోగదారుల వీక్షణల ఆధారంగా ప్లాట్‌ఫామ్‌లో […]
దిశ, ఫీచర్స్ : ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యూట్యూబ్ కొత్తగా ‘న్యూ టు యూ’ ఫీచర్ విడుదల చేసింది. కానీ ఇది ప్రస్తుతం యూఎస్, యూకే, ఫ్రాన్స్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే వరల్డ్ వైడ్ కస్టమర్స్ దీని సేవలు పొందే అవకాశముందని 9to5google అనే టెక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ ఫీచర్ వినియోగదారుల వాచింగ్ ప్రిఫరెన్స్ ఆధారంగా కాకుండా కొత్త కంటెంట్‌ను అందింస్తుందని వెల్లడించింది.
యూట్యూబ్ వినియోగదారుల వీక్షణల ఆధారంగా ప్లాట్‌ఫామ్‌లో న్యూ కంటెంట్‌ను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘న్యూ టు యూ’ ఫీచర్. అయితే ‘లేట్ నైట్ షో’ కంటెంట్ బాగున్నా, నిద్రభంగం కలుగుతుందని, లేదా ఇతర కారణాల వల్ల యూజర్స్ వాటిని స్కిప్ చేస్తుంటారు. కానీ యూట్యూబ్ నివేదికల్లో మాత్రం యూజర్స్ అటువంటి కంటెంట్‌నే ఇష్టపడుతున్నారని తేలింది. దాంతో ఈ న్యూ ఫీచర్ ఇకపై సిమిలర్ కంటెంట్ వెతికి మీకు నొటిఫై చేస్తుందని సదరు కంపెనీ ప్రకటించింది. అలాగే గేమింగ్, బ్యూటీ, ట్రెండింగ్ వంటి కేటగిరీల ఆధారంగా కంటెంట్‌ను అందించే ‘ఎక్స్‌ప్లోర్ ఫీడ్’ కంటే ఇది మరింత భిన్నంగా ఉంటుంది. అలాగే ‘న్యూ టు యూ’ను పర్సనలైజ్డ్ ఫీడ్ అందించే టూల్‌గానూ చెప్పవచ్చు.
ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ డౌన్‌లోడ్స్ పూర్తి చేసుకున్న తొలి యాప్‌గా యూట్యూబ్ రికార్డు నమోదు చేసుకుంది. అంతేకాదు ఇటీవల భారత్‌కు చెందిన వీడియో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘సిమ్‌సిమ్’ యాప్‌ను యూట్యూబ్ కొనుగోలు చేసింది. అలాగే దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలు, రిటైలర్లను కొత్త కస్టమర్లకు చేరువ చేసేందుకు ఈ డీల్ తోడ్పడగలదని యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ తెలిపింది.