మహిళల లిస్ట్ ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బెంగాల్

Update: 2024-12-23 19:27 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల లిస్ట్ ఏ క్రికెట్‌లో బెంగాల్ జట్టు చరిత్ర సృష్టించింది. అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హర్యానాపై ఈ ఘనత సాధించింది. రాజ్‌కోట్‌‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్యానా నిర్దేశించిన 390 పరుగుల భారీ లక్ష్యాన్ని 5 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మహిళల లిస్ట్ ఏ క్రికెట్‌లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.

ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్స్ పేరిట ఉండేది. 2019లో కాంటెర్‌బరీపై 309 పరుగుల లక్ష్యాన్నిచేధించగా.. తాజాగా బెంగాల్ ఆ రికార్డును బద్దలుకొట్టింది. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 389/5 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ(197, 115 బంతుల్లో 22 ఫోర్లు, 11 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. సోనియా మెహందియా(61), రీమా సిసోడియా(58) రాణించారు. అనంతరం బెంగాల్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. తనుశ్రీ సర్కారు(113) సెంచరీకితోడు ప్రియాంక(88 నాటౌట్), ధర గుజ్జార్(69), సస్తీ మోండల్(52) సత్తాచాటడంతో బెంగాల్ భారీ లక్ష్యాన్ని ఛేదించింది.


Tags:    

Similar News