మావోయిస్టుల ఘాతుకం

దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.‌ జగదల్‌పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిమీ దూరంలోని గుమల్వాడ గ్రామంలో రుద్రనాగ్ అనే యువకుడిని మావోయిస్టులు శుక్రవారం హతమార్చారు.‌ నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‌ మావోయిస్టు నేత జోగా‌ మాండవి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్య సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు […]

Update: 2020-10-03 05:03 GMT

దిశ, భద్రాచలం :
ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.‌ జగదల్‌పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిమీ దూరంలోని గుమల్వాడ గ్రామంలో రుద్రనాగ్ అనే యువకుడిని మావోయిస్టులు శుక్రవారం హతమార్చారు.‌ నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‌ మావోయిస్టు నేత జోగా‌ మాండవి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్య సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్పీ దీపక్ కుమార్ ఈ హత్యను ధృవీకరించారు.‌ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీ గంగలూరు ఏరియా కమిటీ ఇన్ ఛార్జీ విజ్జా అలియాస్ భద్రుని తమ సహచర మావోయిస్టులు హత్య చేసిన 48 గంటల వ్యవధిలో జగదల్ పూర్ ఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

Tags:    

Similar News