కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
దిశ, జన్నారం : కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. జన్నారం అదనపు ఎస్ఐ తానాజీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కలమడుగు గ్రామానికి చెందిన ఆదరి అనూష (18 )సంవత్సరాల యువతి గత సంవత్సరం క్రితం జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ జరగగా, తరచూ పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. కడుపు నొప్పి తీవ్రం కావడంతో బాధ భరించలేక, ఆమె గత ఐదు రోజుల […]
దిశ, జన్నారం : కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. జన్నారం అదనపు ఎస్ఐ తానాజీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కలమడుగు గ్రామానికి చెందిన ఆదరి అనూష (18 )సంవత్సరాల యువతి గత సంవత్సరం క్రితం జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ జరగగా, తరచూ పీరియడ్స్ సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ ఉండేది. కడుపు నొప్పి తీవ్రం కావడంతో బాధ భరించలేక, ఆమె గత ఐదు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన యువతి తండ్రి ఆమెనi హుటాహుటిన జన్నారం మండల కేంద్రంలో ఉన్న అమృత ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్ఐ తానాజీ నాయక్ తెలిపారు.