ఫ్రెండ్స్ కదా అని ఫోన్ ఇస్తే.. వాటిని చూపుతూ టార్చర్
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెండ్స్ కదా అని ఫోన్ ఇచ్చిన పాపానికి ఓ యువతి టార్చర్ అనుభవించింది. కొద్దిసేపు మొబైల్ కావాలని తీసుకున్న స్నేహితులు పర్సనల్ డేటాను చోరీ చేశారు. కాల్ రికార్డింగ్స్, వీడియోలు, ఫొటోలు తమ మొబైల్స్‌లోకి షేర్ చేసుకొని.. అనంతరం వాటిని చూపుతూ.. బ్లాక్‌మెయిల్ చేశారు. నగరంలో జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మొవ్య, పూర్ణిమ, సుమతి స్నేహితులు. ఇటీవల మొవ్య సెల్‌ఫోన్ తీసుకున్న పూర్ణిమ-సుమతి అందులో డేటాను […]
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రెండ్స్ కదా అని ఫోన్ ఇచ్చిన పాపానికి ఓ యువతి టార్చర్ అనుభవించింది. కొద్దిసేపు మొబైల్ కావాలని తీసుకున్న స్నేహితులు పర్సనల్ డేటాను చోరీ చేశారు. కాల్ రికార్డింగ్స్, వీడియోలు, ఫొటోలు తమ మొబైల్స్‌లోకి షేర్ చేసుకొని.. అనంతరం వాటిని చూపుతూ.. బ్లాక్‌మెయిల్ చేశారు. నగరంలో జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన మొవ్య, పూర్ణిమ, సుమతి స్నేహితులు. ఇటీవల మొవ్య సెల్‌ఫోన్ తీసుకున్న పూర్ణిమ-సుమతి అందులో డేటాను షేర్ చేసుకున్నారు. పర్సనల్ వీడియోలను మొవ్యకు పంపి వైరల్ చేయకుండా ఉండాలంటే చెప్పింది వినాలంటూ షరతులు పెట్టారు. రోజు రోజుకీ స్నేహితుల వేధింపులు పెరిగిపోతుండడంతో మొవ్య సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుకు ఆధారంగా వేధింపులకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్‌ను పోలీసులకు వినిపించింది బాధితురాలు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.