గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మండలంలోని టోల్‌ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సామెల గ్రామానికి చెందిన దేవల్ బాపు, అదేగావ్‌కు చెందిన తిప్పన్న తీవ్ర గాయాలయ్యాయి.

Update: 2024-12-25 15:34 GMT

దిశ, వాంకిడి : మండలంలోని టోల్‌ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సామెల గ్రామానికి చెందిన దేవల్ బాపు, అదేగావ్‌కు చెందిన తిప్పన్న తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరూ వాంకిడి నుంచి సామెల గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వచ్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో బైక్ పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవల్ బాపు ఒక కాలు పూర్తిగా విరిగిపోగా, శరీరంపై అనేక గాయాలు కాగా తిప్పన్న తలకు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం స్థానిక వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


Similar News