SI Dead Body: పోలీసుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. ఎస్సై సాయి కుమార్ మృతదేహం లభ్యం
మహిళా కానిస్టేబుల్‌తో ఎస్సై, మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్/కామారెడ్డి: మహిళా కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై, మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ శృతి (Shruthi), కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ (Nikhil) మృతదేహాలు బుధవారం రాత్రి వెలికి తీశారు. అయితే, రాత్రి నుంచి ఎస్సై సాయి కుమార్ (SI Sai Kumar) మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తుండగా గురువారం ఉదయం 8.30 ప్రాంతంలో ఆయన డెడీబాడీ (Dead Body)ని ఐడెంటిఫై చేసి చెరువులోంచి బయటకు తీసుకొచ్చారు. కాగా, డ్యూటీలో చాలా నిక్కచ్ఛిగా ఉండే ఎస్సై సాయికుమార్ (SI Sai Kumar) ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు ముగ్గురు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడటానికి కారణాలంటే.. కానిస్టేబుల్ శృతి ఒంటిపై ఉన్న గాయాలు ఎక్కడివి అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.