Harish Rao : మందా జగన్నాథంను పరామర్శించిన హ‌రీశ్‌రావు

నిమ్స్(NIMS) ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannatham)ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు(Harish Rao) పరామర్శించారు.

Update: 2024-12-26 14:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : నిమ్స్(NIMS) ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నాగ‌ర్‌క‌ర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannatham)ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు(Harish Rao) పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు హ‌రీశ్‌రావు. అనంత‌రం జ‌గ‌న్నాథం ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాల‌ను వైద్యుల‌ను అడిగి హ‌రీశ్‌రావు తెలుసుకున్నారు. మందా జగ‌న్నాథంను ప‌రామ‌ర్శించిన వారిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ మంత్రులు దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాగా రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన జ‌గ‌న్నాథంను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News