మాకు ప్రాధాన్యత ఇవ్వండి: శ్రీశైలంలో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి సేవలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు..
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం మల్లిఖార్జున స్వామి(Srisailam Mallikarjuna Swami) సేవలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Telangana Minister Konda Surekha) పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ భక్తుల(Devotees)కు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ భక్తుల విన్నపాలపై ఏపీ ప్రభుత్వం(AP Govt) తమ విజ్ఞప్తిని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున తెలంగాణలో ధర్మప్రచార, నిధులను కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వం పాటించిన విధానాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయాలని కొండా సురేఖ కోరారు.