బైకుల దొంగ అరెస్ట్
పలు బైక్ లను చోరీ చేసిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.
దిశ, అశ్వారావుపేట : పలు బైక్ లను చోరీ చేసిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. బుధవారం ఉదయం అశ్వారావుపేట మండల కేంద్రం భద్రాచలం రోడ్డు హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద ఎస్సై యయాతి రాజు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అశ్వారావుపేటకు చెందిన సరిపల్లి నరసింహారాజు అనే వ్యక్తి బైక్ పై వస్తూ పోలీసులను చూసి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు.
దాంతో పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకొని విచారించారు. ఇతను పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులలో నిందితుడిగా గుర్తించారు. ఇతడిపై 2022 లో సామర్లకోట పోలీస్ స్టేషన్ లో బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకుండా 9 బైకులను చోరీ చేశాడు. కాకినాడ, పెద్దాపురం, సర్పవరం రాజమండ్రి పోలీస్ స్టేషన్లో చోరీ కేసులు ఉన్నాయి. 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినట్టు పోలీసులు తెలిపారు.