విషాదం.. క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
దిశ ప్రతినిధి, కృష్ణాజిల్లా: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. వివరాల్లోకి వెళితే.. అంగళూరు గ్రామం నుండి కౌతారం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన కొమ్మలపాటి సాయి (26) అనే యువకుడు బౌలింగ్ వేస్తూ హఠాత్తుగా కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయిన యువకుడిని హుటాహుటిన గుడివాడ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అతను అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. అప్పటివరకు ఎంతో హుషారుగా క్రికెట్ ఆడిన సాయి మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.