మిస్టరీగా విస్మయ మరణం.. కజిన్ కు పంపిన ఫోటోలే ప్రాణం తీశాయా..?
దిశ, వెబ్‌డెస్క్: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని తమకంటే బాగా చూసుకొంటాడని, జీవితాంతం ఏ కష్టం రాకుండా కాపాడుతాడని తమ ఆర్థిక స్తోమత సరిపోకపోయినా అల్లుడికి మర్యాద తగ్గకూడదని, అప్పుచేసైనా లక్షలు లక్షలు పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. కానీ, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల కాపాడాల్సిన అత్తమామలు కొడుకుకు సపోర్ట్ చేస్తూ కోడలిని రాచి రంపాన పెట్టారు. ఈ బాధలన్నింటిని తల్లిదండ్రులకు చెప్పలేక కజిన్ తో చెప్పుకొని బాధపడింది […]
దిశ, వెబ్‌డెస్క్: అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని తమకంటే బాగా చూసుకొంటాడని, జీవితాంతం ఏ కష్టం రాకుండా కాపాడుతాడని తమ ఆర్థిక స్తోమత సరిపోకపోయినా అల్లుడికి మర్యాద తగ్గకూడదని, అప్పుచేసైనా లక్షలు లక్షలు పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. కానీ, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల కాపాడాల్సిన అత్తమామలు కొడుకుకు సపోర్ట్ చేస్తూ కోడలిని రాచి రంపాన పెట్టారు. ఈ బాధలన్నింటిని తల్లిదండ్రులకు చెప్పలేక కజిన్ తో చెప్పుకొని బాధపడింది ఆ ఇల్లాలు. అదే ఆమె పాలిట శాపమైంది. కజిన్ తో మాట్లాడిన రెండు రోజులకే అత్తవారింట్లో శవంగా మారింది. అత్తవారింట్లో అనుమానాస్పదంగా మృతిచెందిన విస్మయ అనే యువతి మృతి కేరళలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..
కొల్లం జిల్లా పందలం గ్రామానికి చెందిన విస్మయ నాయర్(28) ఆయుర్వేద మెడిసిన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. డిగ్రీ చదువుతున్నప్పుడే ఆమెకు కొల్లం జిల్లా సాస్తంకొట్ట ప్రాంతానికి చెందిన కిరణ్ తో మార్చి 2020 లో వివాహమైంది. కిరణ్ ఓ మోటార్ కంపెనీ లో మేనేజర్ గా చేస్తుండడంతో విస్మయ తల్లిదండ్రులు భారీమొత్తంలోనే కట్నకానుకలు సమర్పించారు. ఒక ఎకరం పొలం, ఒక టొయోటా కారు, లక్షల్లో కట్నం ఇచ్చారు. ఇక అత్తవారింట్లో అడుగుపెట్టిన విస్మయను కిరణ్ కొద్దీ రోజులు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా తనలోని రాక్షసుడు బయటికి వచ్చాడు.
తన పుట్టింటికి వెళ్లి ఇంకా ఎక్కువ కట్నం తేవాలని హింసించడం మొదలుపెట్టాడు. ఈ విషయమై ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి ఆమెపై చేయి చేసుకొని వేధింపులకు గురిచేశాడు. దీంతో భర్త వేధింపులు తాళలేని విస్మయ తన కజిన్ కి ఈ విషయాన్ని చెప్పింది. వాట్స్ యాప్ లో తనపై జరుగుతున్న దాడి, వరకట్న వేధింపులు, తనకు తగిలిన గాయాలు ఫొటోలతో సహా పంపి ఏకరువు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న విస్మయ తల్లిదండ్రులు అల్లుడు కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేశారు.
విస్మయ పుట్టినింటికి వచ్చిన రెండు నెలల తర్వాత విస్మయ తన కాలేజ్ కి పరీక్ష రాయడానికి వెళ్లిందని తెలుసుకున్న కిరణ్ కాలేజ్ కి వెళ్లి భార్య ను ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత తను ఇంటికి రాలేదని విస్మయ తండ్రి త్రివిక్రమన్ తెలిపారు. సోమవారం ఉదయం అత్తవారింట్లో విస్మయ విగతజీవిగా కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త కిరణ్ తెలిపాడు. కానీ, తన కూతుర్ని అత్తవారింటివారే చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారని విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.