బెంగాల్‌‌లో కరోనా వ్యాప్తికి బీజేపీయే కారణం : దీదీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ కరోనా వ్యాప్తికి బీజేపీ నాయకులే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేలాది మంది అవుట్ సైడర్స్ (ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు) వచ్చి ఇక్కడ వైరస్‌ను వ్యాపింపజేశారని ఆమె మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల పేర్లు ఎత్తకుండానే వారిని టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. జల్పాయ్‌గురిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో […]

Update: 2021-04-14 22:40 GMT

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ కరోనా వ్యాప్తికి బీజేపీ నాయకులే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేలాది మంది అవుట్ సైడర్స్ (ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు) వచ్చి ఇక్కడ వైరస్‌ను వ్యాపింపజేశారని ఆమె మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల పేర్లు ఎత్తకుండానే వారిని టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు గుప్పించారు.

జల్పాయ్‌గురిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లు మీరు (మోడీ, షా లను ఉద్దేశిస్తూ) ఎక్కడున్నారు..? కొవిడ్‌ను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపింపజేసి పారిపోతున్నారు. ప్రజలకు సకాలంలో టీకాలు అందించి ఉంటే ఇన్ని కొత్త కేసులు నమోదయ్యేవా..? ఎన్నికల ప్రచారం పేరు మీద వేలాది మంది అవుట్ సైడర్లు బెంగాల్‌కు వచ్చి ఇక్కడ వైరస్‌ను వ్యాపించి.. మాకు ఓటేయండి అని అడుగుతున్నారు..’ అని విమర్శించారు. వ్యాధులెవరికైనా ఎప్పుడైనా వస్తాయని, కానీ వారికి సరైన చికిత్స అందిస్తే అవి తగ్గుతాయని దీదీ అన్నారు. చివరిసారి కొవిడ్ విజృంభించినప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని బీజేపీ నాయకులు.. ఎన్నికలు ఉన్నాయనగానే ఆగమేఘాల మీద బెంగాల్‌కు వస్తున్నారని తెలిపారు.

దీదీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ధర్నాల పేరిట డ్రాయింగ్ లు వేసుకోవడం కంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా బాగుండేదని తెలిపింది. ఇటీవల ఎన్నికల ప్రచారం నుంచి దీదీ ఒక్కరోజు బహిష్కరణకు గురికాగా.. దానిని నిరసిస్తూ ఆమె కోల్‌కతాలో ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ర్యాలీలలో దీదీ మాస్కు ఎందుకు ధరించడం లేదని బీజేపీ ప్రశ్నించింది.

Tags:    

Similar News