అయోధ్య నుంచి యోగి పోటీ
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది. యోగి, బీజేపీ ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు ప్రస్తుత అయోధ్య ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా కూడా సమ్మతం తెలిపారు. సీఎం యోగి ఇక్కడి నుంచి పోటీచేస్తారంటే తమకు గర్వకారణమని, అందుకు తాను పోటీలో నుంచి తప్పుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడి నుంచి చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుందని, అయోధ్య సీఎం ప్రాధాన్యతలో […]
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది. యోగి, బీజేపీ ఈ విషయమై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు ప్రస్తుత అయోధ్య ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా కూడా సమ్మతం తెలిపారు. సీఎం యోగి ఇక్కడి నుంచి పోటీచేస్తారంటే తమకు గర్వకారణమని, అందుకు తాను పోటీలో నుంచి తప్పుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు.
ఎవరు ఎక్కడి నుంచి చేస్తారనేది పార్టీ నిర్ణయిస్తుందని, అయోధ్య సీఎం ప్రాధాన్యతలో ఒకటిగా ఉన్నదని వివరించారు. ఒకవేళ సీఎం యోగి ఆదిత్యానాథ్ అయోధ్య నుంచి పోటీచేయాలని భావిస్తే ఆయనకు క్యాంపెయిన్ చేయడానికీ తాము సిద్ధమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్ వారణాసికి ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు.