రూ. 10,000 కోట్ల నిధుల సమీకరణకు యెస్ బ్యాంక్ బోర్డు ఆమోదం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ రూ. 10,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందని మంగళవారం తెలిపింది. ఈ నిధుల సమీకరణను ఈక్విటీ షేర్లు, డిపాజిటరీ రసీదులు, కన్వర్టబుల్ బాండ్లు, డిబెంచర్లు, వారెంట్లు ఇంకా ఏవైనా ఇతర ఈక్విటీ లింక్‌డ్ సెక్యూరిటీల రూపంలో నిర్వహించడానికి బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఆమోదించారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ప్రక్రియ అనంతరం నిధుల సేకరణ వాటాదారులు, నియంత్రణ సంస్థల నుండి అవసరమైన ఆమోదానికి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ యెస్ బ్యాంక్ రూ. 10,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపిందని మంగళవారం తెలిపింది. ఈ నిధుల సమీకరణను ఈక్విటీ షేర్లు, డిపాజిటరీ రసీదులు, కన్వర్టబుల్ బాండ్లు, డిబెంచర్లు, వారెంట్లు ఇంకా ఏవైనా ఇతర ఈక్విటీ లింక్‌డ్ సెక్యూరిటీల రూపంలో నిర్వహించడానికి బ్యాంకు బోర్డు డైరెక్టర్లు ఆమోదించారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ప్రక్రియ అనంతరం నిధుల సేకరణ వాటాదారులు, నియంత్రణ సంస్థల నుండి అవసరమైన ఆమోదానికి లోబడి ఉంటుంది. కాగా, మంగళవారం స్టాక్ మార్కెట్‌లో యెస్ బ్యాంక్ షేర్లు 2 శాతానికి పైగా పెరిగి రూ. 13.04 వద్ద ట్రేడయ్యాయి. ఇటీవలే యెస్ బ్యాంక్ వినియోగదారులకు యూపీఐ లావాదేవీల సౌకర్యం నుంచి తక్షన రియల్‌టైమ్ చెల్లింపుల సదుపాయాలను అందించడానికి అమెజాన్ పే, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్టు వెల్లడించింది.