ఎల్లో కలర్‌లో తాబేలు.. మీరు చూశారా?
భువనేశ్వర్: ఒడిశాలో అరుదైన తాబేలు కనిపించింది. బాలాసోర్ జిల్లాలో పసుపురంగులో కనిపించిన ఈ తాబేలు స్థానికులకు కనువిందు చేసింది. ఇది అరుదైన జీవి అని వైల్డ్‌లైఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తాబేలు పై కవచమంతా, దాని దేహమంతా పసుపు రంగులోనే ఉన్నదని, ఇది అరుదైన తాబేలు అని, ఇలాంటి తాబేలును ఇదివరకు చూడలేదని వైల్డ్‌లైఫ్ వార్డెన్ భానుమిత్రా ఆచార్య తెలిపారు. ఈ అరుదైన తాబేలు బాలాసోర్‌లోని సుజన్‌పూర్ గ్రామంలో కనిపించింది. దీన్ని చూసిన వెంటనే గ్రామస్తులు […]
భువనేశ్వర్: ఒడిశాలో అరుదైన తాబేలు కనిపించింది. బాలాసోర్ జిల్లాలో పసుపురంగులో కనిపించిన ఈ తాబేలు స్థానికులకు కనువిందు చేసింది. ఇది అరుదైన జీవి అని వైల్డ్‌లైఫ్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తాబేలు పై కవచమంతా, దాని దేహమంతా పసుపు రంగులోనే ఉన్నదని, ఇది అరుదైన తాబేలు అని, ఇలాంటి తాబేలును ఇదివరకు చూడలేదని వైల్డ్‌లైఫ్ వార్డెన్ భానుమిత్రా ఆచార్య తెలిపారు. ఈ అరుదైన తాబేలు బాలాసోర్‌లోని సుజన్‌పూర్ గ్రామంలో కనిపించింది. దీన్ని చూసిన వెంటనే గ్రామస్తులు అటవీశాఖకు సమాచారమందజేశారు. అధికారులు స్పాట్‌కు వెళ్లి ఆ తాబేలును సేకరించారు.