నిర్మలతో వైసీపీ ఎంపీలు భేటీ.. ఎందుకో తెలుసా.?
దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మెుత్తాన్ని తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి […]
దిశ, ఏపీ బ్యూరో: పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైసీపీ ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన మెుత్తాన్ని తక్షణమే రీయింబర్స్‌మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు. నిధులు ఆలస్యమైతే పోలవరం వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందంటూ లేఖను అందజేశారు.