ఇది శుభవార్తే.. పీపీఈ కిట్లపై రోజా ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోని మెడ్‌టెక్ జోన్‌లో పీపీఈ కిట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిట్లను నిన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సారధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి కూడా తెలిసిందే. ఈ కిట్లపై ప్రముఖ సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్మన్ రోజా సెల్వమణి ప్రశంసలు కురిపించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ, ‘ఏపీ సీఎం జగన్ ఏపీలో తయారైన కిట్ల వినియోగాన్ని ప్రారంభించారు. […]
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలోని మెడ్‌టెక్ జోన్‌లో పీపీఈ కిట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిట్లను నిన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సారధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన సంగతి కూడా తెలిసిందే. ఈ కిట్లపై ప్రముఖ సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్మన్ రోజా సెల్వమణి ప్రశంసలు కురిపించారు.
తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ, ‘ఏపీ సీఎం జగన్ ఏపీలో తయారైన కిట్ల వినియోగాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి భయం పెరిగిపోతోన్న నేపథ్యంలో ప్రజలకు ఇది భారీ ఉపశమనం కలిగేంచే విషయం. ఈ కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రోజుకు 2,000 తయారు చేసే సామర్థ్యాన్ని సాధించాం. మే మొదటి వారంలోలోపు ఏపీలో మొత్తం 25,000 కిట్లను తయారు చేస్తారు’ అని తెలిపారు.
కాగా, ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేసేందుకు అవకాశముంటుంది. ఒక పరీక్షకు పట్టే సమయం కేవలం 50 నిమిషాలే.. కరోనాను అరికట్టేందుకు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సర్వే ద్వారా కరోనా లక్షణాలున్న 5,000 మందిని గుర్తించింది. వారిలో దాదాపు 2,000 మందికి పరీక్షలు అవసరమని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలుత వారికి పరీక్షలు చేయనున్నారు.
Tags: ysrcp, mla roja, apiic chairperson roja, andhra pradesh, corona test kits, twitter