టీడీపీ అరుపులను లెక్క చేయను..
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ దుమారం ఇంకా చల్లారలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య డ్రగ్స్ వార్ నడుస్తోంది. వైసీపీ నాయకులు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని టీడీపీ అంటుంటే తమకేం సంబంధం లేదని వైసీపీ అంటోంది. తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో బినామీగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ దుమారం ఇంకా చల్లారలేదు. అధికార ప్రతిపక్షాల మధ్య డ్రగ్స్ వార్ నడుస్తోంది. వైసీపీ నాయకులు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని టీడీపీ అంటుంటే తమకేం సంబంధం లేదని వైసీపీ అంటోంది. తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌కు డ్రగ్స్ సరఫరా చేయడంలో బినామీగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ద్వారంపూడి బదులిచ్చారు.
డ్రగ్స్ రవాణాపై దర్యాప్తు సంస్థల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అరుపులను తాను లెక్కచేయనని చెప్పుకొచ్చారు. అలాగే మీడియాలో తనపై వచ్చే తప్పుడు కథనాలకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. మాదకద్రవ్యాల రవాణాపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని.. 3 నెలల్లో రూ.23 కోట్ల విలువైన గంజాయిని పట్టుకోవడమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.