TTD News : టీటీడీ మరో కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి ఆలయ ఈవో పలు కీలక నిర్ణయాలను వెలువరించారు. ఇకపై తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన మంచి భోజనం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో(TTD EO) శ్యామలరావు తెలియజేశారు. భక్తుల రద్దీ పెరగడంతో నిత్య అనాదన ప్రసాద కేంద్రంలో సిబ్బంది సరిపోవడం లేదని, సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేసి.. భక్తులందరికీ మంచి భోజనం అందిస్తామని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి, దర్శనం సౌకర్యాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తిరుమలలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ కమిషన్ ను ఏర్పాటు చేసి.. తరచూ ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార తనిఖీలు చేపడతామని వెల్లడించారు.
Also Read..