Fiber Net: ఆ రూ.కోటి 15 లక్షలు తిరిగి ఇచ్చేయండి.. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్(Andhra Pradesh Fiber Net) విభాగంలో 410 మంది ఉద్యోగుల తొలగించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్(Andhra Pradesh Fiber Net) విభాగంలో 410 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ విషయాన్ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి(GV Reddy) తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని ఆరోపించారు. త్వరలో మరో 200 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. జీతాల పేరుతో కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. అంతేకాదు.. ఫైబర్ నెట్(Fiber Net) ఉద్యోగులు గత ప్రభుత్వంలో వైసీపీ(YCP) నేతల ఇళ్లలోనూ పనిచేశారని తెలిపారు. ఆ కక్షతో ఉద్యోగులను తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ నుంచి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు రూ.1 కోటి 15 లక్షలు ఇచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే డబ్బులు చెల్లించాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.