మున్సిపోల్స్‌లో గిర్రున తిరిగిన ఫ్యాన్.. చతికిల పడ్డ సైకిల్

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అధికార పార్టీ వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ వేగంగా తిరిగి క్లీన్ స్వీప్ చేయగా, తూర్పుగోదావరిలోని -తుని, పశ్చిమగోదావరిలోని -కొవ్వూరు, కర్నూలులోని -డోన్, గుంటూరు జిల్లాలోని -సత్తెనపల్లి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో -34, 12 కార్పొరేషన్లలలో కడప, చిత్తూరు మేయర్ పీఠాలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. అలాగే, శ్రీకాకుళం […]

Update: 2021-03-14 00:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి అధికార పార్టీ వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ వేగంగా తిరిగి క్లీన్ స్వీప్ చేయగా, తూర్పుగోదావరిలోని -తుని, పశ్చిమగోదావరిలోని -కొవ్వూరు, కర్నూలులోని -డోన్, గుంటూరు జిల్లాలోని -సత్తెనపల్లి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది.

మొత్తం 75 మున్సిపాలిటీల్లో -34, 12 కార్పొరేషన్లలలో కడప, చిత్తూరు మేయర్ పీఠాలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. అలాగే, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, పాలకొండలో వైసీపీ అభ్యర్థులు మందంజలో ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనూ ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతోందని తెలుస్తోంది. ఇదిలాఉండగా, టీడీపీ అభ్యర్థులు ఆది నుంచి ముఖ్యమైన స్థానల్లో వెనుకంజలో ఉండగా.. అమలాపురంలో జనసేన అభ్యర్థులు సత్తా చాటుతున్నట్లు సమాచారం. కాగా, చాలా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

Tags:    

Similar News