బైకు ధరలను తగ్గించిన యమహా మోటార్ ఇండియా

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా(Yamaha Motor India)తన రెండు బైకుల ధరలను తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ఎస్25 మోడల్ బైకు ధరను రూ. 19,300, ఎఫ్‌జెడ్ 25 మోడల్ ధరను రూ. 18,800 తగ్గిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఇటీవల ఆటో పరిశ్రమలో ఇన్‌పుట్ ఖర్చులు అధికంగా పెరిగిపోవడంతో తమ ఉత్పత్తుల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 మోడల్ బైకులపై […]

Update: 2021-06-01 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా(Yamaha Motor India)తన రెండు బైకుల ధరలను తగ్గిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కంపెనీకి చెందిన ఎఫ్‌జెడ్ఎస్25 మోడల్ బైకు ధరను రూ. 19,300, ఎఫ్‌జెడ్ 25 మోడల్ ధరను రూ. 18,800 తగ్గిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఇటీవల ఆటో పరిశ్రమలో ఇన్‌పుట్ ఖర్చులు అధికంగా పెరిగిపోవడంతో తమ ఉత్పత్తుల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎఫ్‌జెడ్ 25 మోడల్ బైకులపై ఈ పెంపు నిర్ణయం తీసుకున్నాం.

అనంతరం కంపెనీ తీసుకున్న పలు చర్యలతో ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించగలిగాం. ఈ నేపథ్యంలో వినియోగదారులపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ, ఆ ప్రయోజనాలను వారికి అందించాలనే ఉద్దేశ్యంతో ఎఫ్‌జెడ్ 25 మోడల్ బైకుల ధరలను తగ్గిస్తున్నట్టు’ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ధరల తగ్గింపు తర్వార ఎఫ్‌జెడ్ఎస్ 25 ధర రూ. 1,39,300కి తగ్గింది. ఎఫ్‌జెడ్ 25 రూ. 1,34,800గా ఉన్నట్టు కంపెనీ వివరించింది. వీటి ధరలను తగ్గించినప్పటికీ ఈ బైకులలో లభించే ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు మునుపటివే ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఎఫ్‌జెడ్ 25 మోడల్ బైకుల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

Tags:    

Similar News