హమాస్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడింది కానీ.. ఆ విషాదాన్ని మరచిపోలేక యువతి ఏం చేసిందంటే..
అక్టోబర్ 7, 2023న జరిగిన హమాస్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన యువతి.. తన 22వ పుట్టినరోజున ఆత్మహత్య చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: అక్టోబర్ 7.. ఇజ్రాయెల్ లో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో హమాస్ మారణహోమం సృష్టించిన రోజు. కొన్నివేలమంది మరణించిన రోజు. యావత్ ప్రపంచం ఆ రోజుని మరచిపోలేని విషాదం జరిగింది. సౌత్ ఇజ్రాయెల్ లో జరిగిన సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ విరుచుకుపడింది. ఆ మారణకాండ నుంచి బయటపడిన షిరెల్ గోలన్ (Shirel Golan) అనే యువతి ఏడాది తర్వాత తన 22వ పుట్టినరోజున ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం ఆ ఘటన తర్వాత ఆమె ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PTSD)తో బాధపడటమేనని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
సుమారు 1200 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. 250 మంది అపహరణకు గురయ్యారు. ఆరోజున మ్యూజికల్ ఫెస్ట్ కి స్నేహితులతో వెళ్లిన షిరెల్ కారుపై హమాస్ దాడి చేసిందని పేర్కొన్నాడు. మొత్తం 11 మందిని కాల్చి చంపగా.. షిరెల్ మాత్రం పోలీస్ వాహనంలో పారిపోయి ప్రాణాలతో బయటపడిందని ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇయాల్ వివరించాడు. ఈ భయానక సంఘటన తర్వాత షిరెల్ పూర్తిగా మారిపోయిందని ఆమె సోదరుడు ఇయాల్ తెలిపాడు. స్నేహితులను కూడా కలవడం మానేసిందని, ఒక్కతే ఉండేందుకు ఇష్టపడేదన్నాడు. ఇవన్నీ PTSD సంకేతాలని తనకు అర్థమైందని, అందుకే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని ఆమెను ప్రోత్సహించినట్లు చెప్పాడు.
నిజానికి తన ఐదుగురు అక్కచెల్లెళ్లతో కలిసి అక్టోబర్ 20న షిరెల్ బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు వెస్ట్రన్ వాల్, కేవ్ ఆఫ్ ది పాట్రియార్క్స్ ను సందర్శించాలనుకున్నామని చెప్పాడు. కానీ.. ఊహించని రీతిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో తామంతా షాకయ్యామని చెప్పాడు. PTSD నుంచి షిరెల్ ను మామూలు మనిషిగా చేయాలని తన తల్లి ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిందని, కానీ.. ఆమె మాత్రం తమను వదిలి వెళ్లిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఏదేమైనా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే ఇలాంటి ఆత్మహత్యల కేసులు మరిన్ని వస్తాయని ఇయాల్ హెచ్చరించాడు.