రష్యాకు మరో ఎదురుదెబ్బ.. మిస్సైల్ దాడిలో రష్యన్ జనరల్ హతం..

ఉక్రెయిన్‌ ఆక్రమణలో నిమగ్నమై ఉన్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2023-07-12 12:36 GMT

కీవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌ ఆక్రమణలో నిమగ్నమై ఉన్న రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు 20 మంది రష్యా సైనిక ఉన్నతాధికారులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మిస్సైల్ దాడిలో లెఫ్టినెంట్ జనరల్ ఒలేగ్ యూరివిచ్ సోకోవ్ చనిపోయాడు. రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ నగరం బెర్డియాన్స్క్‌లో మోటరైజ్డ్ రైఫిల్ విభాగానికి ఆయన సారధ్యం వహిస్తున్నారు. సిటీలో డునా అనే పేరున్న ఒక హోటల్‌ను రష్యా ఆర్మీ ఏడాది క్రితం తమ ఆధీనంలోకి తీసుకుంది. అందులో సైనికులకు సకల సౌకర్యాలు కల్పిస్తోంది.

ఈ హోటల్‌ను ఉక్రెయిన్ ఆర్మీ టార్గెట్‌గా ఎంచుకుంది. "మాల్డ్ డెకాయ్" రకానికి చెందిన అమెరికా షాడో మిస్సైల్‌ను మంగళవారం రాత్రి ప్రయోగించగా.. మొత్తం హోటల్ నేలమట్టమైందని అంటున్నారు. ఆ సమయంలో అందులో ఉన్నవారితో పాటు రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఒలేగ్ యూరివిచ్ సోకోవ్ కూడా మరణించారు. ఈ వివరాలను ఉక్రెయిన్ హోంశాఖ సలహాదారు యాంటోన్ గెరాష్ చెంకో ధృవీకరించారు. అయితే ఈ దాడిని తమ సైన్యమే చేసిందని ఆయన అంగీకరించలేదు.


Similar News