రికార్డ్స్ బ్రేక్.. వరల్డ్ హాటెస్ట్ డే
2023 జూలై 3 సోమవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి రోజుగా నమోదైంది. US నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ ఈ విషయాన్ని తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్: 2023 జూలై 3 సోమవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి రోజుగా నమోదైంది. US నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్రిడిక్షన్ ఈ విషయాన్ని తెలిపింది. దీని ప్రకారం.. సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు నిన్న 17.01 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. కాగా ఇంతటి ఉష్ణోగ్రతలు.. 2016 ఆగస్టులో 16. 92 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వగా తాజాగా దినిని 2023 జులై 3న నమోదైన ఉష్ణోగ్రతలు బ్రేక్ చేశాయి. దీనికి.. వాతావరణ మార్పులతో పాటు ఉద్భవిస్తున్న ఎల్‌నినో నమూనా ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం శాస్త్రవేత్తలు తెలిపారు.