World Earth Day: నేడు 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం'
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి మాత్రమే అని మనందరికీ తెలిసిందే
దిశ, వెబ్ డెస్క్ : సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి మాత్రమే అని మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమిని కాపాడుకోవాల్సిన భాద్యత మనకు ఉంది. భూమి పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కానీ హాని కలిగించే పనులు మాత్రం చేయకుండా ఉంటె చాలు. కాబట్టి ప్రకృతి గురించి చిన్న పిల్లలకు అవగాహన చాలా అవసరం. దీని కోసం కొన్ని సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోంచి వచ్చిందే 'ప్రపంచ ధరిత్రి దినోత్సవం'. నేడు ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో "వరల్డ్ ఎర్త్ డే" జరుపుకుంటున్నారు.