భూమి మూలాల్లో ఉన్న ఇనుముకు తుప్పు..? శాస్త్రవేత్తలు బేజారు!
ఇప్పటికిప్పుడే చెప్పడం అసాధ్యమని చెప్పనవసరం లేదు. Earth's Iron-Rich Core Could Be Rusting An Interesting Remarks.
దిశ, వెబ్‌డెస్క్ః సాధారణంగా ఇనుముకు తప్పుపడితే ఎలా మారుతుందో మనకి తెలుసు. ఆ ఇనుము బలహీనంగా మారి, కొన్నాళ్లకు పొడిలా రాలిపోతుంది, లేదంటే విరిగిపోతుంది. అయితే, భూగర్భంలోనూ ఇనుప ఖనిజం ఉంటుందని మనందరికీ తెలుసు. భూమి మూలం అనేది కరిగిన ఇనుము, నికెల్ మిశ్రమంతో తయారు చేయబడింది. ఇది ఉపరితలం నుండి 2,900 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఇప్పుడు దానికే తప్పు పడుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యంతో, భూతాపం పెరిగిపోవడం వల్ల శాస్త్రవేత్తలు ఇప్పుడు భూమి భౌతికధర్మ శాస్త్రంలో పెద్ద మార్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే, దాన్ని ఇప్పటికిప్పుడే చూసి, చెప్పడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక కొత్త ప్రయోగం ప్రకారం భూమి అంతర్భాగంలోని ఇనుము తప్పు పడుతుందేమోనని అనుమానం వచ్చింది. నిజానికి, ఇనుము తేమతో కూడిన గాలికి లేదంటే ఆక్సిజనేటేడ్ నీటికి గురైనప్పుడు, ఒక రసాయన ప్రతిచర్య జరిగి, ఇనుముపై ఎర్రటి అవశేషాలు ఏర్పడతాయి. తద్వారా బలమైన ఇనుము బలహీనమవుతుంది. అయితే, శాస్త్రవేత్తలు భూమి తుప్పు పట్టిందని ఎందుకు భావిస్తున్నారో తెలుపుతూ అడ్వాన్సింగ్ ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురించారు. ఈ ప్రయోగంలో, శాస్త్రవేత్తలు భూమి కోర్‌లో ఉండే ఒత్తిడి పరిస్థితులను సృష్టించారు. అప్పుడు వారు హైడ్రాక్సిల్-బేరింగ్ ఖనిజ రూపంలో ఇనుముపై తేమను ప్రవేశపెట్టారు. ఓ మిలియన్ వాతావరణం పీడనం దగ్గర అది ఐరన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేసిందని, శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో భూమి అంతర్భాగంలో కూడా తుప్పు ఏర్పడే సూచనలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు.
అగ్నిపర్వత విస్ఫోటనాల సహాయంతో, శాస్త్రవేత్తలు భూమి లోపల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అధ్యయనం చేస్తున్నారు. భూమి ప్రధాన మూల భాగంలో తుప్పు పట్టడం జరిగితే, కోర్-మాంటిల్ బౌండరీ (CBM) వద్ద నిర్దిష్ట భూకంప గుర్తులు కలిగిన పొర ఏర్పడి ఉండాలి. ఇలాంటి, వివిధ "పరీక్షల ముక్కలన్నీ కలిపినప్పుడు ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. భూమి కోర్ తుప్పు పట్టడం అనేది భూమిపై భారీ అంతర్గత ఆక్సిజన్ జనరేటర్ కావచ్చని, తద్వారా గొప్ప వాతావరణ ఆక్సిజనేషన్ సంభవించవచ్చని" రచయితలు తమ పరిశోధనలో రాశారు. అయితే, స్పష్టంగా చెప్పాలంటే, భూమి కోర్ తుప్పు పట్టడానికి ఇది సాక్ష్యం కాకపోవచ్చు. ఇది ధృవీకరించబడటానికి ముందు, శాస్త్రవేత్తలు కొన్ని రుజువులను చూడాలి, కానీ ఇది అంత సులభం కాదు.